భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో పేస్ చేరిక ప్రాధాన్యత సంతరించుకోగా ఇప్పటివరకు బీజేపీలో చేరిన ఆటగాళ్ల వివరాలను పరిశీలిస్తే..
భారత క్రికెట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. 2024లో బీజేపీలో చేరడం పెద్ద చర్చకు దారితీసింది. అలాగే బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. 2020లో బీజేపీలో చేరారు.
ఒలింపిక్ పతక విజేత బాక్సర్ విజేందర్ సింగ్ కూడా 2024లో బీజేపీలో చేరడం విశేషం. ఆయన ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, తరువాత బీజేపీ వైపు మళ్లారు.
అలాగే మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, సిద్ధూ, శ్రీశాంత్,అశోక్ దిండా వంటి వారు కూడా బీజేపీలో చేరారు. ఇంకా రెజ్లింగ్ రంగం నుంచి యోగేశ్వర్ దత్, ఫోగట్, కళ్యాణ్ చౌబే బీజేపీలో చేరారు.
Also Read:కర్ణాటకలో నీటి కొరత ముప్పు!
ప్రముఖ షూటర్లు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, జాస్పల్ రానా, పారా అథ్లెట్ దేవేంద్ర జజారియా, దీపా మాలిక్, మాజీ రెజ్లింగ్ దిగ్గజం దారా సింగ్..1998లోనే బీజేపీలో చేరి, 2003లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు.

