ఎన్నికల శంఖారావం పూరించిన రాహుల్

12
- Advertisement -

రాహుల్ గాంధీ కేరళంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కోజికోడ్ వేదికగా యూడీఎఫ్ (యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి యూడీఎఫ్ విజయానికి కృషి చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ఎన్నికలు కేవలం రాజకీయాల కోసం కాకుండా యువత భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు, అలాగే కేరళ లౌకిక స్వభావాన్ని కాపాడటానికి కీలకమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.రాష్ట్రంలో పెరుగుతున్న అప్పుల భారం, డ్రగ్స్ సమస్య, ఆరోగ్య వ్యవస్థలో లోపాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

Also Read:నోటి దుర్వాసన..కారణం తెలుసా?

రాబోయే ఏప్రిల్ 9న జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా ఈ సమస్యలకు సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

- Advertisement -