ఇంధన కొరత..కేంద్రం కీలక నిర్ణయాలు!

10
- Advertisement -

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయన్న వార్తలు రావడంతో ప్రజల్లో అప్రమత్తత పెరిగింది. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ పలు కీలక నిర్ణయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా ఐటీ, సర్వీస్ రంగాల్లో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ప్రస్తుత పరిస్థితుల్లో వారంలో కేవలం 4 రోజులు మాత్రమే పని ఉండేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మిగతా 3 రోజులు సెలవులుగా ప్రకటించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

శని, ఆదివారాలతో పాటు మరో రోజును సెలవుగా ప్రకటించడం ద్వారా ట్రాఫిక్ తగ్గించి ఇంధన వినియోగాన్ని నియంత్రించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ అంశాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు.

ఇంధన కొరత నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రజల దైనందిన జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు అవసరానికి మించిన ఇంధన నిల్వలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:నోటి దుర్వాసన..కారణం తెలుసా?

- Advertisement -