నదిలో మునిగిపోయిన బస్సు.. 18 మంది మృతి

6
- Advertisement -

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్‌బరి జిల్లా దౌలత్‌డియా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దౌలత్‌డియా ఘాట్ వద్ద బస్సు ఫెర్రీపై ఎక్కే సమయంలో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు సుమారు 30 అడుగుల లోతున్న పద్మా నది లో పడిపోయింది.

ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతి చెందినట్లు ధృవీకరించారు. మరికొంత మంది గల్లంతైనట్టు సమాచారం. స్థానిక అధికారులు, రక్షణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

నదిలో మునిగిన బస్సును బయటకు తీయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.ప్రయాణికులు ఈద్ సెలవులు ముగించుకుని తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కుటుంబాలతో కలిసి ప్రయాణిస్తున్న పలువురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మరింత పెంచింది.

Also Read:నోటి దుర్వాసన..కారణం తెలుసా?

ఈ ఘటనపై స్థానిక ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

- Advertisement -