Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Sunday, July 5, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ సైబర్ వలలో ఎమ్మెల్యే..లక్షలు మాయం
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాష్ట్రాల వార్తలు

సైబర్ వలలో ఎమ్మెల్యే..లక్షలు మాయం

March 22, 2026 10:24 AM
15
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా చిర్రి బాలరాజు అనే పోలవరం ఎమ్మెల్యే సైబర్ మోసానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.

    అపరిచితుల నుంచి వచ్చిన ఒక యాప్ లింక్‌ను క్లిక్ చేయడంతో ఈ మోసం జరిగినట్లు సమాచారం. ఆ లింక్‌ను ఆర్టీఏ (రవాణా శాఖ) చలానా పేరుతో పంపించారు. అది నిజమని నమ్మిన ఎమ్మెల్యే లింక్‌పై క్లిక్ చేయడంతో, ఆయన బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ.12 లక్షలు మాయం అయ్యాయి.

    ఈ ఘటనపై బాధిత ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ నిపుణుల సహాయంతో డబ్బు ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేసి నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

    ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు ముఖ్య హెచ్చరికలు జారీ చేశారు. అపరిచిత లింక్‌లు, ముఖ్యంగా బ్యాంకింగ్ లేదా చలానా పేరుతో వచ్చే మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని సూచించారు. అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లు ద్వారానే చెల్లింపులు చేయాలని సూచిస్తున్నారు.

    ఈ సంఘటన మరోసారి సైబర్ భద్రతపై అప్రమత్తత ఎంత అవసరమో స్పష్టం చేస్తోంది. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

    Also Read:త్వరలో తెలంగాణకు ప్రధాని మోదీ!

    - Advertisement -
    • TAGS
    • bank account
    • Cyber Criminals
    • MLA Chirri Balaraju
    • stole
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleవార్ ఎఫెక్ట్..పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’
      Next articleరోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy