కేంద్ర మంత్రి, ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరికి హత్య బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చిన ఈ కాల్‌పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపులు ఆయన వ్యక్తిగత సహాయకుడు విశ్వేంద్ర షాకు ఫోన్ మరియు వాట్సాప్ ద్వారా వచ్చినట్లు సమాచారం.
ఈ కాల్ చేసిన వ్యక్తి తనను “ఇస్మాయిల్”గా పరిచయం చేసుకున్నాడు. అతను పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిరాబాద్ కు చెందినవాడిగా గుర్తించారు. అతని వద్ద మంత్రి అధికారిక పర్యటన షెడ్యూల్ కాపీ కూడా ఉన్నట్లు సమాచారం, ఇది భద్రతా అంశాలపై ఆందోళన పెంచుతోంది.
ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో బెంగాల్ పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. జయంత్ చౌదరి ప్రస్తుతం కేంద్రంలో స్వతంత్ర బాధ్యతలతో రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే ఆర్‌ఎల్డీ జాతీయ అధ్యక్షుడు.
Also Read:మెగాస్టార్ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్

