- Advertisement -
ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని ప్రభుత్వం కేబినెట్‌ను విస్తరించింది. ఈ సందర్భంగా ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
డెహ్రాడూన్‌లోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ గుర్మిత్ సింగ్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఖజన్ దాస్, మదన్ కౌశిక్,ప్రదీప్ బత్రా, భరత్ చౌదరి, రామ్ సింగ్ కైరా ఉన్నారు.
Also Read:మెగాస్టార్ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్
ఈ కేబినెట్ విస్తరణ ద్వారా చాలా కాలంగా ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ సమతౌల్యం, పార్టీ వ్యూహాలకు అనుగుణంగా ఈ కేబినెట్ విస్తరణ చేపట్టినట్లు భావిస్తున్నారు.
- Advertisement -

