తండ్రితో కలిసి యుద్ధ ట్యాంకర్‌పై కిమ్-జు!

8
- Advertisement -

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు యే మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. తాజాగా తండ్రితో కలిసి యుద్ధ ట్యాంకర్‌పై కనిపించడం చర్చనీయాంశమైంది. ఆర్మీ ట్రైనింగ్ యూనిట్‌ను సందర్శించిన కిమ్ జాంగ్ ఉన్, తన కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కూర్చొని కనిపించారు.

2022 నుంచి కిమ్ జు-యే తరచుగా తన తండ్రితో పాటు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ కనిపిస్తోంది. దీంతో ఆమెకు ఉత్తర కొరియా రాజకీయాల్లో ప్రాధాన్యం పెరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కిమ్ జాంగ్ ఉన్ తన వారసురాలిగా కిమ్ జు-యేను ప్రకటించే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె వయస్సు సుమారు 13 సంవత్సరాలు.

Also Read:మెగాస్టార్‌ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్

కిమ్ కుటుంబానికి సంబంధించిన ప్రతి చిన్న పరిణామం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా వారసత్వ అంశం ప్రాధాన్యత కలిగి ఉండటంతో, కిమ్ జు-యే ప్రదర్శనలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. మొత్తానికి, కిమ్ జు-యే ప్రజా వేదికలపై పెరుగుతున్న ప్రాధాన్యం భవిష్యత్తులో ఉత్తర కొరియా రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు.

- Advertisement -