అస్సాంలో ప్రధాని ఎన్నికల ర్యాలీలు

5
- Advertisement -

అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ ప్రారంభంలో మూడు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 1, 3, 6 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో ఆయన సభలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.

అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది.

ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నాయకత్వంలోని బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

Also Read:హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

సీట్ల కేటాయింపుపై మాట్లాడిన శర్మ.. అసోం గణ పరిషత్ (AGP) 26 స్థానాల్లో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) 11 స్థానాల్లో పోటీ చేస్తాయని, మిగతా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెడతామని తెలిపారు.

- Advertisement -