అర్జున్ టెండూల్కర్‌ – పంత్..ఫన్నీ!

5
- Advertisement -

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. అర్జున్ టెండూల్కర్ బ్యాట్ బరువు గురించి రిషబ్ పంత్‌తో జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల సానియా చందోక్‌ను వివాహం చేసుకున్న అర్జున్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ అయి లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాడు. కొత్త సీజన్ కోసం శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న సమయంలో పంత్‌తో జరిగిన చర్చ అందరి దృష్టిని ఆకర్షించింది.

వీడియోలో పంత్, అర్జున్ ఉపయోగించే బ్యాట్ బరువు తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. దీనికి అర్జున్ స్పందిస్తూ, “నా బ్యాట్ బరువు 1220 గ్రాములు. నా తండ్రి సచిన్ అయితే 1310-1315 గ్రాముల వరకు బరువైన బ్యాట్ వాడేవారు. నేను మాత్రం 1200 గ్రాముల కంటే తక్కువకు వెళ్లను” అని చెప్పాడు.

ఈ సందర్భంగా పంత్, భారీ బ్యాట్ వాడటం వల్ల ఉన్న ప్రయోజనాల గురించి కూడా అడిగాడు. అలాగే కొత్త జట్టులో అర్జున్ సౌకర్యంగా ఉండేందుకు తన సహాయం ఎప్పుడూ ఉంటుందని, ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని చెప్పడం హృదయాన్ని హత్తుకునే అంశంగా నిలిచింది.ఈ సరదా సంభాషణ ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది.

Also Read:హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

- Advertisement -