కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కుమార్తెను జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో అనుసంధానించే సోషల్ మీడియా కంటెంట్‌ను 24 గంటల్లో తొలగించాలని ఆదేశించింది.
మంత్రి కుమార్తె హిమయాని పూరి తనపై వస్తున్న వార్తలు, పోస్టులు, వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మిని పుష్కర్ణా, ఇలాంటి కంటెంట్‌ను ప్రచారం చేయడం, పంచడం, వ్యాప్తి చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని పలు సోషల్ మీడియా యూజర్లకు ఆదేశించారు.
అదేవిధంగా, యూజర్లు స్వచ్ఛందంగా ఆ కంటెంట్‌ను తొలగించకపోతే, సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వాటిని బ్లాక్ చేయాలని లేదా తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది.
హిమాయనీ పూరికి ప్రాథమికంగా బలమైన కేసు ఉందని కోర్టు అభిప్రాయపడింది. తాత్కాలిక ఉపశమనం ఇవ్వకపోతే ఆమెకు తిరిగి సరిచేయలేని నష్టం కలుగుతుందని పేర్కొంది. తదుపరి విచారణ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, కేసును ఆగస్టులో మళ్లీ విచారణకు తీసుకుంటామని తెలిపింది.
ఇక ఎప్స్టీన్ ఫైల్స్ విషయానికి వస్తే, అవి వేలాది పేజీల పత్రాలు. వాటిలో ఎప్స్టీన్ మరియు అతని సహచరురాలు ఘిస్లేన్ మ్యాక్స్వెల్‌పై జరిగిన లైంగిక రవాణా కేసులకు సంబంధించిన ప్రయాణ వివరాలు, రికార్డింగ్స్, ఈమెయిల్స్ వంటి సమాచారం ఉంటుంది. 2019లో ఎప్స్టీన్ జైలులో మృతి చెందిన తర్వాత ఈ ఫైల్స్‌పై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.
Also Read:ఖమేనీకి రక్షణగా నోపో బ్లాక్ క్యాట్స్!

