ఇరాన్‌లో సుప్రీం లీడర్ కుటుంబానికి భద్రత కల్పించే వ్యవస్థ అత్యంత గోప్యంగా ఉంటుంది. ముఖ్యంగా మొజ్తాబా ఖమేనీకి రక్షణగా ఉన్నట్లు చెప్పబడుతున్న “నోపో” బ్లాక్ క్యాట్స్ కమాండోలు అత్యున్నత శిక్షణ పొందిన ప్రత్యేక దళంగా భావిస్తున్నారు. వీరు సాధారణ భద్రతా సిబ్బందికంటే పూర్తిగా భిన్నంగా పనిచేస్తారు. అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, మరియు ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లతో వీరు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు.
నోపో దళం ఇరాన్‌లోని ఇతర భద్రతా విభాగాలైన IRGCతో నేరుగా సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే వీరి కార్యకలాపాలు బయటకు రావడం చాలా అరుదు. ఈ కమాండోలు “డేగ కళ్లతో” ప్రతి చిన్న కదలికను గమనిస్తూ, ప్రమాదం తలెత్తే ముందు స్పందించే సామర్థ్యం కలిగి ఉంటారు.
మొజ్తాబా ఖమేనీ భద్రత కోసం నాలుగు నోపో బ్రిగేడ్లు పనిచేస్తున్నాయని సమాచారం. వీరు ప్రాణాలకు తెగించి పోరాడే స్థాయిలో కఠినమైన ట్రైనింగ్ పొందారు. ఎప్పటికప్పుడు స్థానం మార్చడం, గోప్య మార్గాలు వినియోగించడం, డిజిటల్ ట్రాకింగ్‌ను తప్పించుకోవడం వంటి వ్యూహాల వల్ల ఆయన ఆచూకీ బయటపడటం కష్టమవుతోంది.
ఈ కారణాల వల్లే అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా మొజ్తాబా ఖమేనీ కదలికలను ఖచ్చితంగా గుర్తించడం కష్టంగా మారిందని భావిస్తున్నారు.
Also Read:OTT:ఈ వారం ఓటీటీ సినిమాలివే

