24 ఏళ్ల దక్షిణాఫ్రికా బ్యాటర్ జోర్డాన్ హెర్‌మన్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. గాయం కారణంగా అతను సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది ఇంకా ప్రకటించలేదు.
సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌కు ముందు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హెర్మన్, తన మొదటి మ్యాచ్‌లోనే గాయపడ్డాడు. మౌంట్ మౌంగనుయిలోని Bay Ovalలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతని కుడి తొడ కండరానికి గాయం అయింది. స్కాన్‌ల్లో అతనికి గ్రేడ్-2 హ్యామ్‌స్ట్రింగ్ టియర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
దక్షిణాఫ్రికా జట్టు ఇంకా అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయలేదు. రెండో టీ20లో జట్టు ఎలా ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్‌లో మాత్రం దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.
మొదటి టీ20లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించగా, దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతంగా రాణించారు. కేవలం 91 పరుగులకే న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేశారు. న్కోబాని మొకొయెనా మూడు వికెట్లు తీసుకోగా, గెరాల్డ్ కోయెట్జీ, ఓట్నీల్ బార్ట్‌మన్ మరియు కెప్టెన్ కేశవ్ మహారాజ్ తలో రెండు వికెట్లు తీశారు.
లక్ష్యాన్ని చేధించే క్రమంలో కానర్ ఎస్టర్‌హుయిజెన్ అజేయంగా 45 పరుగులు చేసి జట్టును విజయానికి నడిపించాడు. దీంతో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ కేశవ్ మహారాజ్ మాట్లాడుతూ,..మా ప్రణాళికలు అన్ని సక్సెస్ అయ్యాయి. మా బౌలర్లు అద్భుతంగా అమలు చేశారు. ఇది యువ బౌలింగ్ లైనప్ అయినప్పటికీ, వారికి ఇచ్చిన బాధ్యతను వారు బాగా నిర్వహించారు. చివర్లో కొంత టెన్షన్ ఉన్నా, కానర్ మరియు డియన్ చూపించిన పరిపక్వత జట్టును గెలిపించింది. మా జట్టులో ఉన్న ప్రతిభను చూడటం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.
Also Read:ఖమేనీకి రక్షణగా నోపో బ్లాక్ క్యాట్స్!

