ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యంగా 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా పంపిణీ చేయనున్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో కీలకమైన ఈ వ్యాక్సిన్ ద్వారా బాలికల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని చీపురుపల్లిలో కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించగా ఈ సందర్భంగా బాలికలకు తొలి టీకా డోసును అందించారు.
తెలంగాణలో హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో నిర్వహించే టీకా పంపిణీ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పాల్గొన్నారు.
ప్రభుత్వం పాఠశాలల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, తల్లిదండ్రులకు టీకా ప్రాధాన్యాన్ని వివరిస్తోంది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Ind Vs Wi:మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే?

