కరూర్ ఘటనపై సీఎం స్టాలిన్

8
- Advertisement -

కరూర్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. క్షతగాత్రులను పరామర్శించిన స్టాలిన్… మెరుగైన వైద్యం అందించాలని కరూర్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరోవైపు తొక్కిసలాట ఘటన.. కంటతడి పెట్టించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విగతజీవులుగా మారిన తమవారిని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి చెప్పులు.

Also Read:స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి:హైకోర్టు

- Advertisement -