బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి అని సూచించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు, జీవో ఇవ్వడం సరికాదని తెలిపింది హైకోర్టు.
కోర్టుల జోక్యం ఉండకూడదంటే, 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పాలన్న తెలంగాణ హైకోర్టు తెలిపింది. గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా, మీరు జీవో విడుదల చేసి, ముందుకు పోతాం అంటే ఎలా? చెప్పాలని తెలిపింది.
గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం సరికాదు…రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలి అనే నిబంధన ఉంది కదా,రిజర్వేషన్లపై అడ్వకేట్ జనరల్‌ను అనేక ప్రశ్నలు వేసింది హైకోర్టు. దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ వినాలని హైకోర్టును కోరారు అడ్వకేట్ జనరల్.అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తే, మ్యాటర్ మీరు చెప్పినప్పుడు వింటాం అన్నారు జడ్జి. ప్రభుత్వాన్ని అడిగి చెప్తామన్నారు అడ్వకేట్ జనరల్.
Also Read:BB9:డేంజర్ జోన్‌లో వారిద్దరూ

