దేశ రాజధాని దిల్లీలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే రాష్ట్రంలో పుట్టిననటి తాప్సీ కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొందట. తాప్సీ నటించిన పింక్ చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సినిమా కూడా దేశంలో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపుల అంశంపై తెరకెక్కించారు. ఈ సందర్భంగా తాప్సీ తన జీవితంలో ఇలాంటి బాధలు ఎన్నో అనుభవించానంటూ మీడియాతో చెప్పింది.
యుక్త వయసులో తానూ లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చారు నటి తాప్సీ. ఇప్పటివరకూ తాను చాలా ధైర్యవంతురాలిని అంటూ చెప్పుకొచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ తన నిజజీవితంలోని మరో కోణాన్ని తాజాగా పేర్కొన్నారు. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా సంచలనం కలిగిస్తోంది. తాప్సీకిప్పుడు తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేవు. హిందీలో బిగ్‌బీ అమితాబ్‌తో నటించిన పింక్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. అందులో ఈ భామ అత్యాచారానికి గురైన అమ్మాయిగా నటించారు.
ఈ పాత్ర గురించి ఇప్పటికే చాలాసార్లు ప్రచారం చేసుకున్న తాప్సీ.. తాజాగా ఈ పాత్రకు, తన నిజ జీవితానికి చాలా పోలికలు ఉన్నట్టు పేర్కొన్నారు. అదేమిటో చూద్దాం. ”నేను డిల్లీలో పెరిగాను. ఏదైనా ఉత్సవాల సమయంలో జనాల కూటమి అధికంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో అబ్బాయిలు అమ్మాయిలను అల్లరి చేస్తారు. కానిచోట్ల గిల్లుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. లైంగిక వేధింపులకు పాల్పడతారు. చాలా శాడిజం ప్రదర్శిస్తారు.
అలాంటి క్లిష్టపరిస్థితులను నేనూ ఎదుర్కొన్నాను. ద్వంద్వార్థాలతో హింసిస్తుంటారు. వారి చూపులు కూడా చాలా క్రూరంగా ఉంటాయి. అందుకే అలాంటి చోట్లకు వెళ్లవద్దని, అలాంటి దుస్తులు ధరించవద్దని, అణిగిమణిగి ఉండాలని ఇంట్లో పెద్దలు హితవు పలికేవారు. అప్పట్లో లైంగిక వేధింపులను ఎదిరించకపోవడం నేను చేసిన తప్పు అని ఇప్పుడు అనిపిస్తోంది” అని నటి తాప్సీ పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఏనాడూ ఈ విషయంపై నోరెత్తని ఈ సొట్టబుగ్గల సుందరి ఇప్పుడు అకస్మాత్తుగా లైంగిక వేధింపులను ఎందుకు బయటకు తీసుకొచ్చిందనే విషయంపై సినీ జనాలు చర్చించుకుంటున్నారు.