రకుల్ ఇక బిగ్ సి భామ

286
Rakul Preet Singh as Brand ambassador for Big C
Rakul Preet Singh as Brand ambassador for Big C
- Advertisement -

ఓపక్క పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా వున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోపక్క కమర్షియల్స్ కూడా బాగానే చేస్తోంది. ఆ క్రమంలో తాజాగా ప్రముఖ మొబైల్ మార్కెట్ సంస్థ ‘బిగ్ సి’కి బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరించడానికి అంగీకరించింది. గతంలో ఈ సంస్థకు ఇలియానా, సమంత వంటి తారలు ప్రచారకర్తలుగా వ్యవహరించారు.

Rakul Preet Singh as Brand ambassador for Big C

టాలీవుడ్‌లో లక్కీ బ్యూటీ అంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరే చెప్పాలి. ఒప్పుకున్నవీ, దాదాపు ఖరారైనవీ లెక్కేస్తే, అరడజనుకు పైగానే సినిమాలు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేతిలో వున్నాయి. చరణ్‌తో ‘ధృవ’, మహేష్‌ – మురుగదాస్‌ కాంబినేషన్‌లో సినిమా, ఇది కాకుండా మరికొన్ని సినిమాలతో రకుల్‌, టాలీవుడ్‌లో ఇంకే ఇతర హీరోయిన్‌ లేనంత బిజీగా వుంది. సినిమా సంపాదనే కాదు, ఇతరత్రా సంపాదనలోనూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మిగతా హీరోయిన్లకు అందనంత ఎత్తులో వుందిప్పుడు.

Rakul Preet Singh as Brand ambassador for Big C

తాజాగా బిగ్‌-సి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి, భారీ ఆఫర్‌ ఇచ్చిందట ఆ సంస్థ. అదెంత.? అంటే, కళ్ళు చెదిరే ఫిగర్‌.. (రెమ్యునరేషన్‌) అని గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. టాలీవుడ్‌లో ఎప్పుడెవరు లైమ్‌లైట్‌లో వుంటే, వాళ్ళకి భారీ ఆఫర్స్‌ ఇచ్చి, బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంటుంది బిగ్‌-సి సంస్థ. అలా ఇప్పుడు రకుల్‌కి ఈ బంపర్‌ ఆఫర్‌ దక్కిందన్నమాట.
అందాల భామలు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తే, సదరు సంస్థ రెప్యుటేషన్‌ పెరుగుతుందా.? అన్న విషయం పక్కన పెడితే, తమ బ్రాండ్‌ వాల్యూ మాత్రం అమాంతం పెరిగిపోతుందని ఆ సంస్థ చెబుతోంది. కోటిన్నరకు పైగానే సినిమాల్లో రెమ్యునరేషన్‌ అందుకుంటున్న రకుల్‌, పెద్ద హీరో.. చిన్న హీరో.. అని ఏమాత్రం ఆలోచించడంలేదు. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లే చేజిక్కించుకుంటోంది. ‘బ్రహ్మూెత్సవం’లో ఆఫర్‌ వదిలేసుకున్నా, మహేష్‌ – మురుగదాస్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన విషయం విదితమే.

Rakul Preet Singh as Brand ambassador for Big C

ఇక తనను బిగ్ సీ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికచేయడం చాలా సంతోషంగా ఉందని రకుల్ ప్రీత్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -