ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. దాదాపు ఏడున్నర గంటల పాటు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారించారు. అనంతరం నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. రేపు (జూలై 20) ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
లిక్కర్ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపుల చెల్లింపు తదితర అంశాలపై మిథున్ రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎవరెవరితో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించారు అనేదానిపై ఆరా తీసింది. డొల్ల కంపెనీల నుంచి సొమ్మును తరలించిన విధానంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Also Read:వర్షాకాలం..న్యుమోనియాతో జాగ్రత్త!
మిథున్ రెడ్డిని అరెస్ట్ ను వైసీపీ ఖండించింది. చంద్రబాబు కక్ష రాజకీయాలకు ఇది పరాకాష్ట అని వైసీపీ నాయకత్వం మండిపడింది. ఈ తరహా చర్యలు ఎల్లకాలం సాగవని హెచ్చరించింది. 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు. దీంతో పాటు వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు.

