వానాకాలం పంటలకు నీటి విడుదల

8
- Advertisement -

వానాకాలం పంటలకు నీటి విడుదలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయంలో నీటి పారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

సాగునీటి అంశంలో రైతాంగం ఇబ్బంది పడకూడదని, వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖాధికారులతో నీటి పారుదల శాఖాధికారులు సమన్వయం చేసుకోవాలని అన్నారు.

వానాకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Also Read:వర్షాకాలం..న్యుమోనియాతో జాగ్రత్త!

- Advertisement -