వర్షాకాలంలో న్యుమోనియాతో జాగ్రత్త!

39
- Advertisement -

వర్షాకాలం వచ్చిందంటే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు, వంటి వ్యాధులు తరచూ వేధిస్తుంటాయి. వర్షంలో తడవడం కారణంగా లేదా వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యల బారిన పడుతుతుంటము. అయితే ఇవి సాధారణ ఆరోగ్య సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది న్యుమోనియా కు దారి తీయవచ్చు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడితే అది న్యుమోనియాకు దారి తీయొచ్చు. వర్షాకాలంలో ఏర్పడే బ్యాక్టీరియా, వైరస్ లు గాలి ద్వారా మన శరీరంలోక్ చేరినప్పుడు న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఇది ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారిలో .అనగా పిల్లలు మరియు వృద్దులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ అని చెప్పవచ్చు. కొన్ని సార్లు న్యుమోనియా ప్రాణాంతకం కూడా కావొచ్చు. కాబట్టి న్యుమోనియా విషయంలో అశ్రద్ద వద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యుమోనియాలో చాలానే రకాలు ఉన్నాయి, ఫంగల్ న్యుమోనియా, వైరల్ న్యుమోనియా, బ్యాక్టీరియల్ న్యుమోనియా.. వంటివాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వ్యూమోనియా ఉన్నవారిలో దగ్గు, చలి జ్వరం, ఛాతీనొప్పి, కొన్ని సందర్భాల్లో వికారం, వాంతులు, విరోచనలు.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సరైన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read:కేర్ ఫుల్: పుట్టగొడుగులు తింటున్నారా..!

అయితే న్యుమోనియా విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఎక్కువగా గోరువెచ్చని నీటిని తాగడం, తేనె నిమ్మకాయ కలిపి వేడినీటితో తాగడం, వంటి చిట్కాల ద్వారా న్యుమోనియాను అదుపు చేయవచ్చు. అయితే న్యుమోనియా తగ్గడానికి చాలానే సమయం పడుతుంది కాబట్టి.. సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతైన అవసరం. ఇంకా న్యుమోనియా ఉన్నవాళ్ళు సామాజిక దూరం పాటించడం, దగ్గెటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కు ఏదైనా గుడ్డ అడ్డుపెట్టుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటివి చేయాలి. అప్పుడే న్యుమోనియా నుంచి త్వరగా బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:బ్రోకి నో కట్స్..అండ్ రన్ టైమ్ అదే!

- Advertisement -