KTR: పొంగులేటి కాదు..బాంబులేటి

5
- Advertisement -

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడిన కేటీఆర్.. ఖమ్మంలో ముగ్గురు మొనగాళ్లు లాగ తిరుగుతున్నారు… బాంబులు అని చెప్పిండు పొంగులేటి గత దీపావళి పోయింది మళ్ళీ దీపావళి వస్తుంది ఇప్పటికీ పేలలేదు అని ఎద్దేవా చేశారు.

ఆయన పొంగులేటి కాదు, బాంబులేటి అని పిలుస్తున్నారు… కమిషన్లలో ఒకాయన బిజీ ఉన్నాడు… రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదు.. ఎరువులు ఇవ్వడంలో విఫలం అయ్యారన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరెయ్యాలి.. బీఆర్ఎస్ సత్తా చాటాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా మా కోసం కార్యకర్తలు, నాయకులు కష్టపడ్డారు… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం కష్టపడి ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ లుగా వారిని గెలిపించుకుంటాం అన్నారు.

Also Read:బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం:ఏపీ మంత్రి

ప్రభుత్వం మీద ప్రజలకు పీకల దాకా కోపం ఉంది. ఈ వ్యతిరేకతను సరిగ్గా వాడుకుంటే ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పరిషత్తులు బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుంది అన్నారు. యువకులు ముందుకొచ్చి కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించగలిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అన్నారు.

అంతకముందు దివంగత మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్.

- Advertisement -