ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం.. ఈ లక్షణం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని ఖచ్చితంగా చెప్పాలి.. ఇది చదివిన తరువాత మీరు కూడా ఒప్పుకుంటారు. 14 ఏళ్లు ఉద్యమనాయకుడిగా ఎన్నో ఆటుపోట్లు చూశారు కేసీఆర్.. తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిషలు కష్టపడుతూ.. అందరినీ కలుపుకొని ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ కోసం పోరాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. తన పట్ల విశ్వాసంతో ఉండేవారి విషయంలో ఎంతటి కేర్ తీసుకుంటారో..ప్రోటాకల్ వంటివి సైతం మరచి ఎలా ఆదరిస్తారో తెలిసిందే. తాజాగా మంగళవారం కూడా అలాంటి ఘటన చోటు చేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే.. మంగళవారం గొర్రెల పంపిణీ కార్యక్రమం అనంతరం కేసీఆర్.. వేదిక దిగి వెళుతున్నప్పుడు రామచంద్రారెడ్డి అక్కడికి వచ్చారు. కూతుళ్లతో కలిసి వచ్చిన ఆయన కేసీఆర్ ను కలిశారు. తనకు ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన్ను అప్యాయంగా పలుకరించిన కేసీఆర్.. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం పద అన్నా అంటూ వెంట తీసుకెళ్లారు. అయితే.. తాను మందులు వేసుకోలేదని ఇప్పుడు తినలేదని చెప్పారు. కలెక్టర్ ను పిలిచి ఇంటి స్థలం కేటాయించాలని చెప్పటంతో పాటు.. ఏ అవసరం వచ్చినా.. ఈ తమ్ముడు ఉన్నాడని మరవకండి అంటూ ఆయనకు ధైర్యం చెప్పారు. అంతేనా.. వెళ్లే ముందు వదినమ్మను అడిగినట్లు చెప్పండన్నా అంటూ అప్యాయతను ప్రదర్శించిన కేసీఆర్ వైనానికి రామచంద్రారెడ్డి విపరీతమైన ఆనందానికి గురయ్యారు. వయసులో పెద్దయినా రామచంద్రారెడ్డిని కేసీఆర్ గౌరవించే తీరును అక్కడున్న వారు గొప్పగా చెప్పుకోవటం కనిపించింది.
ఇంతకీ ఈ రామచంద్రరెడ్డి ఎవరంటే.. టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన పూర్తి పేరు దొమ్మాట రామచంద్రారెడ్డి. నేవిలో పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ హాయంలో టీడీపీ తరుపున ఎమ్మెల్యే టికెట్ పొందడం.. గెలవడం.. జరిగిపోయాయి. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఎన్టీఆర్‌కు రామచంద్రారెడ్డి విభేదాలు వచ్చాయి. ఆర్మీ మనస్తత్వం కావడంతో పదవికాలం ఐదేళ్లు ముగియక ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. రాజకీయాల్లోకి రావడంతో ఆయన ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఆయన ఆర్థికంగా దారుణమైన స్థితిలోకి వచ్చారు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఇంటి స్థలం కోసం దరఖాస్తు పెట్టుకోగా.. ఐదేళ్లు పదవికాలంలో లేనందువల్ల ఆయనకు ఇంటి స్థలం కేటాయించలేదు అధికారులు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ను కలిసి తన గోడును చెప్పుకున్నాడు. ఇంకేముంది కలెక్టర్ పిలిచి ఇంటి స్థలం కేటాయించాలని చెప్పటం.. అన్నా అని అందరి ముందు అనటమే కాదు.. ఏం సాయం కావాలన్నా ఈ తమ్ముడు ఉన్నాడని మరువకు అని అనడం.. ఇలా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమని చెప్పక తప్పదు..