దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ ను డిఎంకె బృందం ఆయనను నేడు కలిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతోంది అన్నారు.
పార్టీలతో సంబంధం లేకుండా డిలిమిటేషన్ వ్యతిరేకంగా అందరూ స్పందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీంతో ఏకీభవించిన రేవంత్ ఈ నెల 22న డిఎంకె ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతానని చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.
దేశ జిడిపిలో అత్యధిక షేర్ దక్షిణాది నుంచి వస్తున్నా, నిధులు మాత్రం కేంద్రం నుంచి కేటాయింపులు జరగడం లేదన్నారు.. స్థానిక అవసరాల కోసం ప్రాజెక్ట్ లకు సహాయం చేయకపోగా , కనీసం అనుమతులు కూడా ఇవ్వడం లేదన్నారు.
Also Read:ఉన్మాదిలా మాట్లాడుతున్న రేవంత్: హరీష్ రావు

