ఆ ఫ్యాన్స్‌ ని వదిలే ప్రసక్తే లేదు..

214
- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ సినిమాలంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. డిఫరెంట్ కథా చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే బన్నీ సరైనోడు బ్లాక్ బస్టర్‌ హిట్‌ను తనఖాతాలో వేసుకున్నాడు.

తర్వాత గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే.. దువ్వాడ జగన్నాథంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా గురించి వస్తున్న అప్ డేట్స్ కూడా సినిమా మీద భారీ అంచనాల్ని పెంచుతున్నాయి.

 Duvvada Jagannadham movie USA schedules

ఇక ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది.  దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాపై బజ్ ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశాలు ఎక్కువే. ఇక యూఎస్ నుంచి కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టేందుకు హీరో అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు.

జూన్ 30 నుంచి జులై 2వరకు చికాగోలో జరిగే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సభలకు అల్లు అర్జున్ హాజరు కానున్నాడు. పనిలో పనిగా అమెరికాలోని ముఖ్యమైన సిటీల్లో తిరిగి తన డీజే సినిమాను బాగా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడట.

 Duvvada Jagannadham movie USA schedules

ఎందుకంటే బన్నీ లాస్ట్ ఫిలిం సరైనోడు ఇక్కడ మంచి కలెక్షన్లే రాబట్టినా యూఎస్ లో మాత్రం పెద్దగా వర్కవుట్ అవలేదు. అమెరికాలో మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ సరైన ప్రమోషన్ లేని కారణంగానే కలెక్షన్లు పెద్దగా రావడం లేదని… అందుకే ఈసారి టూర్ లో వారిని అట్రాక్ట్ చేసే ప్రోగ్రాం ప్లాన్ చేశాడన్నది అర్జున్ సన్నిహితుల మాట.

మొత్తానికి ఇక్కడి ఫ్యాన్స్‌ తో పాటు అమెరికాలో ఉన్న ఫ్యాన్స్‌కి కూడా బన్ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు. మరి డీజే చెయ్యాలనుకుంటున్న ప్లాన్స్‌ అక్కడ వర్కౌట్‌ అవుతే..అమెరికాలో కూడా డీజే మోత మోగిపోవడం ఖాయమనే చెప్పాలి.

- Advertisement -