బీటెక్ చేసి…పేపర్‌ బాయ్‌గా

252
paper boy

సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’.టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. హీరోయిన్ బీటెక్ చేసి న్యూస్ పేప‌ర్స్ వేస్తున్నావా అని హీరోని ప్ర‌శ్నించ‌గా అది బ‌త‌క‌డం కోసం, ఇది భ‌విష్య‌త్ కోసం అని చెబుతాడు. టీజర్‌లో చెప్పిన డైలాగ్స్ అలరిస్తున్నాయి. ఈ చిత్రానికి కథా,కథనం అందించిన సంప‌త్ నంది నిర్మాతగా మారాడు. త్వ‌ర‌లోనే సినిమా ఆడియో వేడుకను ఘనంగా జరపనున్నారు. టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి…

Paper Boy Official Teaser | Santosh Shoban, Riya Suman,Tanya Hope | Jaya Shankarr | Sampath Nandi