Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, June 23, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ట్విట్టర్‌లో అగ్రతార ఎవరో తెలుసా..?
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

ట్విట్టర్‌లో అగ్రతార ఎవరో తెలుసా..?

June 19, 2017 3:44 PM
212
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    కేటీ పెర్రీ వరల్డ్ పాప్ సంగీతాన్ని ఫాలో అయ్యేవాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తన గాత్రంతో అందాలతోనూ ఆకర్షించే ఈ భామకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఐదేళ్ల కిందట ఐపీఎల్ ఆరంభోత్సవంలో పెర్ఫామ్ చేయడం ద్వారా భారతీయ అభిమానుల్ని అలరించింది పెర్రీ. తాజాగా ఈ ప్రముఖ అమెరికన్ పాప్‌ సింగర్‌ కేటీ పెర్రీ ఓ రికార్డు సృష్టించింది. సోషల్‌ మీడియా మాధ్యమం ట్విటర్లో 100 మిలియన్ ఫాలోవర్లు కలిగిన తొలి సెలబ్రెటీగా పేరు తెచ్చుకుంది. 2009లో ట్విటర్ ఖాతా తెరిచిన కేటీ పెర్రీ తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.

    Katy Perry 100 Million Followers in Twitter

    కేటీ పెర్రీ.. కేవలం తన మ్యూజిక్‌తోనే కాదు, ట్విట్టర్‌లో ఫాలోవర్లను పెంచుకోవడంలోనూ అగ్ర స్థానంలో దూసుకుపోతుంది. ప్రసుతం ఈమెకు ట్విట్టర్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగానే కాదు 10 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి ట్విట్టర్ యూజర్‌గా కేటీ పెర్రీ రికార్డు సృష్టించింది. అభిమానులు ఆదరించడం వల్లే తాను ఈ ఘనత సాధించానని ఈ సందర్భంగా కేటీ పెర్రీ తెలిపింది. అంతేకాదండోయ్‌.. ఏ విషయం చెప్పాలన్నా ముందు అభిమానుల కోసం ట్విటర్లో ప్రకటించాకే మీడియా ద్వారా ప్రకటిస్తుందట.

    ఇక అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న వారిలో 97 మిలియన్లతో పాప్ సింగర్ జస్టిన్ బీబర్ రెండో స్థానంలో నిలిచాడు. ఆ తరువాత 90 మిలియన్ల ఫాలోవర్లతో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 3వ స్థానంలో నిలిచారు.

    - Advertisement -
    • TAGS
    • 100 million followers
    • Barak Obama
    • Jestine Bibar
    • Katy Perry
    • MOST FOLLOWED PERSON IN TWITTER
    • MOST TWITTER FOLLOWERS ACCOUNT
    • Pop superstar
    • social media Pop Singar
    • Twitter
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleఆ ఫ్యాన్స్‌ ని వదిలే ప్రసక్తే లేదు..
      Next articleకాజల్ బర్త్ డే టీజర్
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy