ఢిల్లీ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు

2
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజ్‌నివాస్‌ మార్గ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.కాల్‌కాజీ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ.

ఢిల్లీ నిర్మాణ్‌భవన్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. లేడీ ఇర్విన్ స్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తల్లిదండ్రులను వీల్ చైర్‌లో పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు కేజ్రీవాల్. అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మాణ్ భవన్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా 13,766 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్‌జనశక్తి రాం విలాస్‌ పాసవాన్‌ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. ఈనెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read:కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ సమావేశం

- Advertisement -