2024 సంవత్సరం మరో 20 రోజుల్లో ముగియనుంది. ఇక ఈసంవత్సరం ఎన్నో జ్ఞాపకాలను మిగల్చగా మరికొన్ని చేధు వార్తలు సైతం ఉన్నాయి. సీపీఎం సీతారం ఏచూరి నుండి బాబా సిద్ధిక్ వరకు ఈ ఏడాది మరణించిన రాజకీయ నాయకుల వివరాలను పరిశీలిస్తే.
మహారాష్ట్ర నుండి నాలుగుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బాబా సిద్ధిక్. ఆ తర్వాత ఎన్సీపీలో చేరారు. 12 అక్టోబర్ 2024న ముంబైలో లారెన్స్ బిష్ణోయ్ ముఠా నియమించిన ముష్కరుల కాల్పుల్లో సిద్ధిక్ మరణించాడు.
భారతదేశంలోని కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు సీతారం ఏచూరి. 12 సెప్టెంబర్ 2024న అనారోగ్యంతో మృతి చెందారు. 2005 నుండి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 1992 నుండి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు కాగా సీపీఎం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
అలాగే బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ 13 మే 2024న మరణించారు. 2005 నుండి 2013 వరకు తిరిగి 2017 నుండి 2020 మధ్యన బీహార్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. క్యాన్సర్‌తో 72 ఏళ్ల వయసులో మృతి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ 2024 ఆగస్టు 10న మృతి చెందాడు. మన్మోహన్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
భారత రాష్ట్ర సమితి (BRS) నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి 6 సెప్టెంబర్ 2024 న 52 సంవత్సరాల వయస్సులో మరణించారు. బీఆర్ఎస్ నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జిట్టా …ఆ తర్వాత వైసీపీ,బీజేపీ, కాంగ్రెస్‌లో పనిచేశారు. చనిపోయే కొద్ది నెలలకు ముందు బీఆర్ఎస్‌లో చేరారు జిట్టా.