2029లో ఒకే దేశం-ఒకే ఎన్నికలు: అమిత్ షా

2
- Advertisement -

ఒకే దేశం ఒకే ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టి 100 రోజులు కావొస్తున్న సందర్భంగా మాట్లాడిన అమిత్ షా..ఈ ప్రభుత్వ హయాంలోనే ఒకే దేశం ఒకే ఎన్నికలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

2024 మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక దేశం.. ఒకే ఎన్నిక అంశానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు అమిత్ షా. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.

దేశంలో ఒకేసారి ఎన్నికలతో చాలా ప్రయోజనాలున్నాయని పేర్కొన్న కమిటీ.. నిర్దిష్ట సిఫార్సులు చేసింది. లోక్ సభ , అసెంబ్లీ ల ఎన్నికలు ఒకసారి, తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్ధల ఎన్నికలను మరోసారి నిర్వహిస్తే సముచితంగా ఉంటుందని కోవింద్ కమిటీ పేర్కొంది. 18 వేల పేజీలతో నివేదికను కోవింద్ కమిటీ రూపొందించింది.అయితే ప్రతిపక్షాలు ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Also Read:KTR: చిట్టినాయుడు(రేవంత్) సుభాషితాలు!

- Advertisement -