రాజీనామా చేసే ప్రసక్తే లేదు:స్వాతి

9
- Advertisement -

తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు ఆప్ ఎంపీ స్వాతి మలివాల్. ఈ నెల 13వ తేదీన సీఎం నివాసంలో కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

రాజ్యసభ పదవిని వదులుకోవాలంటూ స్వాతి మలివాల్‌పై ఒత్తిడి వస్తోందని మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన మలివాల్…ఎంపీ సీటు కావాలంటే నన్ను అడిగి ఉండాల్సిందన్నారు. బీజేపీ ఏజెంట్‌గా ముద్రవేశారు… ఎంపీ పదవి నుంచి తప్పుకోను మరింత కష్టపడి పనిచేస్తా అని తేల్చిచెప్పారు.

2006లో తాను ఎవరికీ తెలియనప్పుడు ఈ వ్యక్తులతో కలిసి పనిచేశాను. ఇంజినీరింగ్ జాబ్ వదులుకుని మరీ వీళ్లతో చేరాను. అప్పట్లో ముగ్గురం మాత్రమే ఉండేవాళ్లం. అప్పటి నుంచి ఎలాంటి పదవులూ ఆశించకుండా పనిచేశానని తెలిపారు.

Also Read:వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోని!

- Advertisement -