KTR:మరోసారి కాంగ్రెస్‌ను నమ్మితే భంగపాటే

25
- Advertisement -

కాంగ్రెస్‌ను మరోసారి నమ్మితే భంగపాటు తప్పదన్నారు బీఆర్ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.కాంగ్రెస్‌ పార్టీ హామీలను నెరవేర్చాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు తులంబంగారం అన్నాడు,ఆడపడుచులకు నెలకు రూ.2500, స్కూటీ బైక్‌లు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అన్నాడు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 150 రోజులవుతున్నది. రాష్ట్రంలో ఎవ్వరికైనా తులం బంగారం వచ్చిందా? ఆలోచించాలన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు అభయహస్తం పేరిట హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. నాలుగు నెలలుగా వాటిని నెరవేర్చకుండా భస్మాసుర హస్తం చూపెడుతున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లోనూ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని …ఒకసారి మోస పోతే మోసగాడి తప్పు అని, రెండుసార్లు మోసపోతే తప్పు మనదే అవుతుందని చెప్పారు.

అన్ని అవకాశాలు ఇచ్చినా బీఆర్‌ఎస్‌ను మోసం చేసిన కడియం శ్రీహరి, అరూరి రమేశ్‌ విశ్వాసఘాతకులు అని మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుగా నాగర్‌కర్నూల్‌ సెగ్మెంట్‌ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

Also Read:ఆరంభం..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -