మాజీ భర్తతో సూపర్ స్టార్ కూతురు

16
- Advertisement -

సౌందర్య రజినీకాంత్.. తన భర్త ధనుష్ తో విడిపోయాక, డైరెక్షన్ లో బిజీ అయ్యింది. అయితే, పర్సనల్ లైఫ్ లోనూ సౌందర్య రజినీకాంత్ బిజీ బిజీగా ఉందని, ఓ తమిళ హీరోతో ఆమె డేటింగ్ కూడా చేస్తోంది అంటూ ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఇంకా చేస్తున్నాయి కూడా. ఇవన్నీ ఇలా ఉంటే.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. అనే డైలాగ్‌ లా ఇప్పుడు సౌందర్య రజినీకాంత్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తన మాజీ భర్త‌ ధనుష్ తో కలిసి మళ్లీ పని చేసేందుకు సై అంటోంది. ఇద్దరు పిల్లలు పుట్టాక, పైగా చాలా ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. వారి విడాకులకు పలు కారణాలు వినిపించినా.. ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు.

విడాకుల తర్వాత కొంత కాలానికి సౌందర్య రజినీకాంత్ మరో వివాహం చేసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపించినా.. అవి నిజం అని ఇంకా నిర్ధారణ కాలేదు. సౌందర్య రజినీకాంత్ ఇంకా సింగిల్ గానే ఉండిపోయింది. అటు ధనుష్ కూడా ప్రస్తుతానికి సింగిలే. ఐతే, ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ కలిసి పని చేయబోతున్నారనేలా టాక్ వినబడుతోంది. అందుకు కారణం ‘లాల్ సలామ్’ సినిమా పరాజయమే అని టాక్. సౌందర్య రజినీకాంత్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినా ఆ సినిమా సక్సెస్ కాలేదు.

Also Read:దొండకాయ ఉపయోగాలు తెలుసా?

తన భార్య సౌందర్య రజినీకాంత్ కి మంచి సినిమాని ఇవ్వాలని ధనుష్ ఫీల్ అవుతున్నాడట. ధనుష్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సౌందర్య రజినీకాంత్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. మీ సినిమాలో మీ మాజీ భర్త నటిస్తారా ? అనే ప్రశ్నకు సౌందర్య రజినీకాంత్ సమాధానమిస్తూ.. నటన అనేది ఆయన వృత్తి. దానిని ఆయన తన పర్సనల్ విషయాలకు లింక్ పెట్టరు. పాత్ర నచ్చితే నా సినిమాలో నటిస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి మాజీ భర్తతో సౌందర్య రజినీకాంత్ సినిమా చేయబోతుంది అన్నమాట.

- Advertisement -