స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవడం ఎలా ?

15
- Advertisement -

నేటి రోజుల్లో ఆన్లైన్ మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బ్యాంకింగ్ సమాచారం, మొబైల్ లోని వ్యక్తిగత సమాచారం.. ఇలా ప్రతిదీ కూడా హ్యాకర్స్ సులువుగా దొంగిలిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించిన ఆన్లైన్ మోసాలను అరికట్టడం కష్టంగానే ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు జరగడానికి ప్రధాన కారణం.. బ్యాంకింగ్ యాప్స్, ఫోటోస్, సోషల్ మీడియా అకౌంట్స్ వంటివాటికి సున్నితమైన పాస్వర్డ్ పెట్టుకోవడం. ఈజీగా గుర్తుంచుకునేందుకు చాలమంది సింపుల్ పాస్వర్స్ పెట్టుకుంటూ ఉంటారు ( 1111,0000,1234.. etc. ) సాధారణంగా పాస్వర్డ్ సెట్ చేసుకునేందుకు ఒకటి నుంచి ఎనిమిది నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ( ఆయా యాప్స్ ను బట్టి ). ఈ పాస్వర్స్ సెట్ చేసుకోవడంలో న్యూమరిక్ నెంబర్స్, కివర్డ్స్, స్పెషల్ నెంబర్స్.. ఇలా ఉపయోగిస్తుమారు.

అయినప్పటికి పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా హ్యాకర్స్ హ్యాక్ చేస్తూనే ఉన్నారు. అయితే హ్యాకర్స్ బారినుంచి తప్పించుకోవడానికి ఎమోజీ పాస్వర్స్ ఉపయోగించడం చాలా మంచిదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎమోజీస్ పాస్వర్డ్ ను హ్యాక్ చేయడం అంతా తేలిక కాదు. ఎందుకంటే ఆలోచనను ప్రతిభింభించేలా ఎమోజీస్ ఉంటాయి. ఉదాహరణకు చెడు చూడకు, చెడు వినకూ, చెడు అనకు.. అనే పదాలను ప్రతిబింభించేలా మూడు కోతులను ఉపయోగించవచ్చు. అలాగే దుఃఖం, నవ్వు, ఏడుపు.. ఇలా ఏ భావనైనా తెలిపే ఎమోజీస్ ను ఉపయోగిస్తూ వారియొక్క అభిరుచికి తగినట్లుగా ఎమోజీస్ ను పాస్వర్డ్ లా ఉపయోగించవచ్చు. కాబట్టి ఇది సేఫ్ గా ఉండడంతో పాటు హ్యాకర్స్ బారినుంచి కాపాడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా అకౌంట్స్, బ్యాంకింగ్ యాప్స్, పర్సనల్ ఫోటోస్.. ఇలా వీటన్నిటికి ఎమోజీస్ పాస్వర్డ్ ఉపయోగించడం మంచిది.

Also Read:‘గర్భాసనం’ యొక్క లాభాలు..!

- Advertisement -