సీనియర్ హీరోలలో నటసింహ నందమూరి బాలకృష్ణ మాత్రమే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే ఆన్ స్టాపబుల్ షో ద్వారా యూత్ లో కూడా క్రేజ్ ను పెంచుకున్నాడు. ఆ క్రేజ్ కారణంగానే బాలయ్య గత చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఒకవైపు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వరుస ప్లాప్స్ తో సతమతమౌతుంటే బాలయ్య మాత్రం ఈజీగా హిట్స్ కొడుతున్నాడు. అయితే హిట్స్ వస్తున్నప్పటికి ఓ కల మాత్రం బాలయ్యకు అందని ద్రాక్షలాగే ఉంది. అదే వంద కోట్ల క్లబ్.
సీనియర్ హీరోలలో చిరంజీవి మాత్రమే ఖైదీ నెంబర్ 150 మూవీ తో వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలయ్య ఎప్పటినుంచో వందకోట్లపై కన్నేసినప్పటికి దగ్గరగా వెళ్ళి ఆగిపోతున్నాడు. అఖండ రూ.75 కోట్లు, వీరసింహ రెడ్డి రూ.80 కోట్లు, భగవంత్ కేసరి రూ.70 కోట్లు.. ఇలా గత మూడు చిత్రాలు కూడా వందకోట్ల దగ్గరగా వచ్చి నిలిచిపోయాయి. దాంతో ఈసారి ఎలాగైనా వందకోట్ల క్లబ్ లోకి చేరాలని బాలయ్య పట్టుదలగా ఉన్నాడు.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో బాలయ్యని విభిన్నంగా చూపించేందుకు బాబీ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడట. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి రిలీజ్ అయిన బాలయ్య మూవీస్ రికార్డ్ కలెక్షన్లు రాబట్టాయి. అందువల్ల ఈ మూవీతో ఎలాగైనా వంద కోట్ల సాధించాలని చూస్తున్నాడు బాలయ్య. మరి ఈ మూవీతో వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.
Also Read:కుంకుమ పువ్వుతో ప్రయోజనాలు?