Ram Mandir:ఎస్పీజీ పర్యవేక్షణలో అయోధ్య

27
- Advertisement -

అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రపంచ దేశాల నుండి అతిథులు రానుకండగా , అయోథ్యకు వచ్చే అతిథులతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇక ఈ నెల 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ఉండనుండగా వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తున్నాయి.

ఇక ఇవాళ సాయంత్రం నుండి సామాన్య భక్తులను ఎవరిని అనుమతించరు. ఇప్పటికే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయోధ్యకు చేరుకోగా ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుండి భక్తులకు శ్రీరాముడి దర్శనం ఉండనుంది. ఇక అయోధ్యంలో అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు.

అమెరికాలాంటి దేశంలో ఉపయోగిస్తున్న ఆధునిక భత్ర వ్యవస్థను అయోధ్యలో నెలకొల్పారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో 250 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. శత్రుదుర్బేద్యంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయగా ఎల్లో జోన్‌గా ప్రకటించారు.

Also Read:ఆ లేడీ రైటర్‌ ను కాపీ కొట్టిన త్రివిక్రమ్

- Advertisement -