IND VS AFG:గ్రాండ్ విక్టరీ.. అదుర్స్!

33
- Advertisement -

టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ మద్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ లో అఫ్గాన్ గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గాన్ బ్యాట్స్ మెన్స్ లలో మహ్మద్ నబీ ( 42 ) పరుగులతో రాణించాడు. ఇక ఆ లక్ష్య చేధనలో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 17.3 ఓవర్లలోనే 159 పరుగులు చేసి తొలి విజయాన్ని దక్కించుకుంది. భారత్ బ్యాట్స్ మెన్స్ లలో శివం దూబే ( 60 ) పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దూబే కు తోడు జితేష్ శర్మ ( 31 ) రాణించడంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఆదిలోనే రన్ అవుట్ గా వెనుదిరిగి పరుగుల ఖాతానే తెరవకుండా అందరినీ నిరాశపరిచాడు.

ఇక శుబ్ మన్ గిల్ ( 23 ), తిలక్ వర్మ ( 26 ) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఇక తొలి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన శివం దూబే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ తన రన్ అవుట్ గురించి మాట్లాడుతూ ప్రతి ఆటగాడు మ్యాచ్ లో భాగం కావాలనుకుంటాడు. కానీ రన్ అవుట్ కావడం కాస్త బాధ కలిగించినప్పటికీ ఇలాంటివి సహజమని చెప్పుకొచ్చాడు. జితేష్, శివం దూబే బాగా ఆడారని, తిలక్ వర్మ, రింకూ సింగ్, పేసర్లు, స్పిన్నర్లు మంచిగా ప్రదర్శన చేశారని రోహిత్ అన్నాడు. ఏది ఏమైనప్పటికి మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇక రెండో మ్యాచ్ ఈ నెల 14 న జరగనుంది. మరి రెండో మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి. రెండో మ్యాచ్ తో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read:ఏపీలో కాంగ్రెస్ ‘సెన్సిటివ్ ప్లాన్’?

- Advertisement -