మనం ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి రోగ నిరోధక శక్తి ఒక కొలమానంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే మనకు తెలియకుండానే ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆ తరువాత వాటి నుంచి బయట పడేందుకు వైద్యులను సంప్రదించడం, మెడిసిన్స్ వాడడం వంటివి చేస్తుంటారు. అయితే అనవసరంగా మెడిసిన్స్ తీసుకోవడం కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు శరీరంలో కనిపించే లక్షణాలను బట్టి వైద్యులను సంప్రదించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మరి శరీరంలో రోగ నిరోధక శక్తి లోపిస్తే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయో చూద్దామా !
రోగనిరోధక శక్తి లోపిస్తే ముఖ్యంగా శరీరం బలహీనంగా మారుతుంది. అలసట, నిస్సత్తువ వేధిస్తాయి. ఇంకా ఒత్తిడి నిరాశ వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగ నిరోధకశక్తి లోపించినప్పుడు రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. తద్వారా తరచూ జబ్బు పడుతూ ఉంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం.. వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. అయితే ఈ వింటర్ సీజన్ లో ఇవి సాధారణ సమస్యలే అయినప్పటికి ఎడతెరిపి లేకుండా ఈ సమస్యలు వేధిస్తే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని గుర్తించాలి. ఇంకా కొంతమందిలో తరచూ చెవినొప్పి, తలనొప్పి వంటి సమస్యలు కూడా లో ఇమ్యూనిటీకి సంకేతాలే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన సమస్యలు ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించి సరైన మెడిసన్ తీసుకోవడం, వైద్యుల సలహా సూచనల మేరకు ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలు తినడం వంటివి చేయాలి. తద్వారా రోగనిరోధక శక్తిని కాపాడుకోవచ్చు.
Also Read:హను-మాన్‌కు రెస్పాన్స్ అదుర్స్: అమృత అయ్యర