బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 98 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఓటింగ్‌పై క్లారిటీ ఇచ్చారు నాగార్జున. వచ్చీరాగానే రెండో ఫైనలిస్ట్‌ను ప్రకటించే టైమ్ వచ్చేసందంటూ అందరినీ యాక్టివిటీ ఏరియాలోకి రమ్మన్నారు. అక్కడ ప్రియాంకను సెకండ్ ఫైనలిస్ట్‌గా అనౌన్స్ చేశారు. తర్వాత అందరిని కూర్చోబెట్టి అక్కడ ఒక వీల్ ఏర్పాటు చేశారు. దానిపై వీక్-1 నుంచి వీక్-14 వరకూ రాసి ఉంది. ఇక ఈ 14 వారాల్లో ఏ వారం మీకు బ్యాడ్ మెమొరీస్ ఉన్నాయి.. రిగ్రెట్ అయిన వీక్ ఏంటో చెప్పాలని నాగ్ ఒక్కొక్కరినీ అడిగారు.
తొలుత ప్రియాంక 7వ వారం తన బిహేవియర్‌పై రిగ్రెట్ అవుతున్నట్లు చెప్పింది. 7వ వారం నామినేషన్స్ డే రోజు తెలుసో తెలీకో ఒకటి అనేశాను భోలే అన్న విషయంలో అని చెప్పింది. అర్జున్ అయితే 13వ వారం ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్నాను.. బలంతో పాటు బలగం కూడా ఉండాలని అప్పుడే తెలిసింది అని చెప్పగా శోభా అయితే 9వ వారం అని చెప్పింది. ఆ వీక్ మొత్తం నాగ్ సార్ నన్నే తిట్టారు అని చెప్పగా యావర్ నాకు రిగ్రెట్ ఫీలయ్యే వీక్స్ చాలానే ఉన్నాయ్ సార్ అంటూ నాలుగు చెప్పాడు. ప్రశాంత్ అయితే నాగార్జున నిన్న ప్లే చేసిన వీడియో గురించి చెప్పగా శివాజీ ఈ వీక్‌లో నేను వాడిన పదాలు నా వ్యక్తిగతం అనుకున్నాను కానీ అవి బయట వ్యక్తులని కూడా బాధపెట్టాయని మీరు చెప్పాకే అర్థమైంది అని చెప్పాడు.
తర్వాత ఎప్పుడూ లేని విధంగా వరుసగా మీమ్స్ వేసి చూపించారు నాగార్జున. ప్రతి వారం మీమ్ ఆఫ్ ది వీక్ అంటూ ఒక్కటి మాత్రమే ప్లే చేసేవారు. కానీ ఈ వారం వరుసగా ఆరు-ఏడు మీమ్స్ చూపించారు. తర్వాత యావర్ మూడో ఫైనలిస్ట్‌గా ఎంపిక కాగా నాలుగో ఫైనలిస్ట్‌గా అమర్‌ని రివీల్ చేశారు. తర్వాత ఈ వారం గెస్ట్‌గా ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి రాగా స్టేజ్ మీదే తన కొత్త సినిమా ‘నా సామిరంగ’ ఫస్ట్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయించారు నాగార్జున. ప్రశాంత్‌కి రైతు బిడ్డ కాకుండా భూమిబిడ్డ అనే టైటిల్ ఇచ్చేశాడు. ఇక చివరిగా మిగిలిన శివాజీ-శోభా శెట్టిలను యాక్టివిటీ ఏరియాకి పిలిచారు. కాసేపు టెన్షన్ పెట్టి శోభా శెట్టి ఎలిమినేటెడ్ అని ప్రకటించేశారు.
Also Read:చలికాలంలో ఇవి తింటున్నారా?