వన్డే ప్రపంచకప్ ఫైనల్లో నిరాశ పర్చింది టీమిండియా. మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనుకున్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది ఆస్ట్రేలియా. ఫైనల్లో రోహిత్ సేనను మట్టి కరిపించి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. భారత్ విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని 41 ఓవర్లలోనే చేధించింది. డేవిడ్ వార్నర్ (7), మిషెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4)విఫలమైన ట్రావిస్ హెడ్, లబుషెన్ ఆసీస్‌ను విజేతగా నిలిపారు. ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 4 సిక్స్‌లు, 15 ఫోర్లతో 137 పరుగులు చేయగా లబుషేన్ 58 నాటౌట్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ 66, విరాట్ కోహ్లీ 54 పరుగులు చేయగా రోహిత్ శర్మ 47, పరుగులతో రాణించగా మిగితా బ్యాట్స్ మెన్ అంతా విఫలమయ్యారు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించలేక ఫైనల్లో చితకలపడిపోయింది. హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ఆసీస్‌కు రూ.33 కోట్ల ప్రైజ్ మనీ రాగా భారత్ రూ . 16 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది.
Also Read:కల నెరవేరేనా.. కప్పు కొడతారా?