Congress:’స్కాం’గ్రెస్.. పెద్ద ప్లానే ఇది!

54
- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ ప్రజలను ఆకర్శించేందుకు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఓటర్లకు గాలం వేసేందుకు అమలుకు సాధ్యం కానీ హామీలను ప్రకటిస్తూ పైకి కలరింగ్ ఇస్తున్నప్పటికీ ఆ హామీల వెనుక ఉన్న మతలబ్ రాష్ట్ర ప్రజలకు పెను భారంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నా మాటలు అందరినీ ఆలోచింపజేసేలా చేస్తున్నాయి. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రకటించిన హామీలన్నీ వేల కోట్లతో ముడిపడి ఉన్నాయని ఆ హామీల అమలుకు ప్రజలపై పెను ఆర్థిక భారం పడడం గ్యారెంటీ అని హెచ్చరిస్తున్నారు రాజకీయ నిపుణులు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 2500 మరియు రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, చేయూత కింద నెలవారి పెన్షన్ రూ. 4వేలు, వీటితో పాటు, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం గృహ జ్యోతి అంటూ ఆరు హామీలను మెయిన్ గా హైలెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ హామీలు పారదర్శకంగా అమలు చేయాలంటే ఒక్కో తెలంగాణ పౌరుడిపై ప్రస్తుతం కంటే అదనపు భారం పడుతుంది. తద్వారా ధరల పెరుగుదల, బస్సు ఛార్జీలు పెంపు, కొత్త రకాల పన్నులు.. ఇలా చాలానే ప్రజలను ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇదే హామీలను ప్రకటించి కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు విషయంలో మాత్రం చేతులెత్తేసింది. ఇప్పటికే అక్కడి ప్రజలపై అదనపు భారం పడుతున్నట్లు ఆ రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. ఇక ఈ తెలంగాణ విషయానికొస్తే ఆరు హామీలు మాత్రమే కాకుండా మరిన్ని మనీ పంపిణీ హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచి కేవలం ఓటర్లను ఆకర్శించేందుకే మేనిఫెస్టో రూపొందించారా ? అని అనుమానాలు మరింత పెంచుతోంది హస్తం పార్టీ. అయితే అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదనే ఉద్దేశ్యంతోనే అమలుకు సాధ్యం కానీ హామీలను కాంగ్రెస్ ప్రకటిస్తోందనే అభిప్రాయం అందరిలోనూ నెలకొంది. అందువల్ల కాంగ్రెస్ ఎన్ని హామీలు ప్రకటిస్తూ జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మరనేది అందరికీ తెలిసిన విషయం.

Also Read:స్పార్క్ సక్సెస్‌లో భాగమైన అందరికి థ్యాంక్స్‌..

- Advertisement -