KTR:ఆలేరులో మంత్రి కేటీఆర్ రోడ్ షో

60
- Advertisement -

గత 5 రోజుల్లో 21 నియోజకవర్గాల్లో కేటీఆర్ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ ఆలేరు, మిర్యాలగూడ,ఉప్పల్, ఎల్బీనగర్‌లో రోడ్ షోలు నిర్వహించనున్నారు మంత్రి కేటీఆర్. ఇక కేటీఆర్ రోడ్ షోల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బీఆర్ఎస్ నేతలు.

ఉదయం 11 గంటలకు పోచంపల్లిలో రోడ్ షో, 1 గంటకు ఆలేరులో, 3 గంటలకు మిర్యాలగూడలో, 5 గంటలకు ఉప్పల్‌లో, 7 గంటలకు ఎల్బీనగర్ రోడ్‌ షోలో పాల్గొననున్నారు. ఓ వైపు సీఎం కేసీఆర్, మరోవైపు కేటీఆర్,హరీశ్‌ రావు, కవిత ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు నిర్వహిస్తున్న రోడ్‌ షోలకు మంచి స్పందన వస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.

Also Read:ఇవి మీ డైట్ లో ఉంటేచాలు..!

- Advertisement -