తన పనిమనిషి కూతురు కనిపించకుండా పోయిందని.. ఆమెను కనిపెట్టిన వారికి రూ.50వేలు చెల్లిస్తానని నటి సన్నీలియోనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ముంబై పోలీసులను ట్యాగ్ చేసి, అనుష్క కిరణ్ మోరా అనే 9 ఏళ్ల బాలికను కనుగొనడానికి వెంటనే సాయం చేయాలని కోరారు. అయితే తాజాగా పాప దొరికింది. దీంతో హాట్ బ్యూటీ సన్నీలియోనీ అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా.. ‘మా ఇంట్లో పని చేసే మహిళ 9 ఏళ్ల కూతురు తప్పిపోయి దొరికింది. ఆమెను వెతకడానికి సాయం చేసినందుకు అభిమానులకు, ముంబై పోలీసులకు ధన్యవాదాలు చెప్తూ మరో పోస్టు పెట్టింది సన్నీ. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని సన్నీ రాసుకొవచ్చింది. కాగా, ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు మహారాష్ట్రలో 16-35 ఏళ్ల వయసున్న 3,594 మంది మహిళలు అదృశ్యమైనట్టు తెలుస్తోంది.
అందుకే, సన్నీ ఈ పాప విషయంలో చాలా టెన్షన్ పడిందట. ఇక సన్నీ డీపే ఫేక్ వీడియోల పై కూడా రియాక్ట్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన్న ను డీపే ఫేక్ వీడియోల బెడద ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో మరొక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సన్నీ మాట్లాడుతూ.. ఇలాంటివి చూసినపుడు వాటిని షేర్ చేయకుండా వదిలేస్తే సరిపోతుంది అని చెప్పింది. అప్పుడు, ఈ వీడియోలు వైరల్ కావు అని ఆమె తెలిపింది.
Also Read:కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది:నీలం మధు