సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్..

8
- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు లోకనాయకుడు కమల్ హాసన్. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని కమల్ ఆవిష్కరించగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కమల్. కృష్ణ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

కృష్ణ విగ్రహాం ఆవిష్కరణపై మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్,దేవినేని అవినాష్ లకు ధన్యవాదాలు తెలిపారు. నాన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని..ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

టాలీవుడ్ లో ఎన్నో చారిత్రాత్మక సినిమాలు తీసి, ఎవర్ గ్రీన్ హీరో గా నిలిచారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా వైవిధ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.

Also Read:కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది:నీలం మధు

- Advertisement -