డ్రై ఫ్రూట్స్ లో ఒకటిగా పరిగణించే ఖర్జూరాలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పోషకాల గనిగా ఖర్జూరలకు పేరు ఉంది. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీర సంరక్షణలో ఉపయోగ పడడం తో పాటు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. వీటిలో విటమిన్ ఏ, సి, ఇ, కె, బి6, బి12 వంటి పోషకాలతో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మాంగనీస్, ఫైబర్, వంటి సూక్ష్మ పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. అయితే చాలామంది ఖర్జూరాలను ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. అలా కాకుండా సమయాభావం తో సరైన టైమ్ లో వీటిని తినడం వల్ల అందులో ఉండే పోషకాలు సమృద్దిగా శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు..
ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే పడగడుపున వీటిని తింటే మంచి ఫలితాలు ఉంటాయట. రాత్రంతా ఖర్జూరాలను తేనెలో నానబెట్టి ఉదయం వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందట. ముఖ్యంగా మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయట. ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతాయట. అంతేకాకుండా శరీరంలోని కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రక్త హీనతతో బాధపడే వారు ప్రతిరోజు పాలతో లేదా మీగడ, నెయ్యి వంటి వాటితో కలిపి ఖర్జూరాలను తింటే రక్తకణాల సంఖ్య పెరిగి రక్తహీనత దూరమౌతుందట.
ఇంకా ఈ చలికాలంలో వచ్చే గొంతు నొప్పి, మంట, జలుబు, వంటి సమస్యలను దూరం చేయడంలో ఖర్జూర పండు గుజ్జు ఎంతగానో ఉపయోగ పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం ఎముకల బలాన్ని పెంచడంలోనూ వాటిని దృఢంగా మార్చడంలోనూ మంచి ఫలితాలను ఇస్తాయట. నీరసం, నిసత్తువ, బద్దకం వంటి సమస్యలతో బాధపడే వారు భోజనం తరువాత గాని లేదా భోజనం ముందుగాని రెండు ఖర్జూరాలు తినడం వల్ల శరీరంలో నూతన ఉత్సాహం మొదలౌతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం రెండు ఖర్జూరాలైన తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్న మాట.
Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే