నేచురల్ స్టార్ నాని సినిమాల్లో సాధారణంగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు ఉంటాయి. అదేవిధంగా, శౌర్యువ్ దర్శకత్వం వహించిన నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ కూడా డిఫరెంట్ జోనర్ సాంగ్స్ ఆల్బమ్ తో అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బిట్స్ ఫిలాని క్యాంపస్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా మూడో సింగిల్ ‘అమ్మాడి’ పాటని లాంచ్ చేశారు.
మృణాల్ ఠాకూర్ తన థర్డ్ యానివర్సరీని రివీల్ చేస్తూ తన పెర్ ఫార్మెన్స్ తో పాట ప్రారంభమవుతుంది. “ఇది నా భర్తకు అంకితం చేస్తున్న చాలా ప్రత్యేకమైన పాట. అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వస్తున్నారు. పాట నా మాతృభాష తెలుగులో ఉంది’’ అంటూ మృణాల్ వాయిస్ తో పాట మొదలౌతుంది. ఈ పాట నాని, మృణాల్‌ల స్వీట్, బ్యూటీఫుల్ ప్రేమకథను చూపిస్తూ పెద్ద వేడుకను సెలబ్రేట్ చేస్తోంది. ఈ సోల్ ఫుల్ మెలోడీ.. వారి పెళ్లి రోజు నుండి, వివాహ ప్రారంభ రోజులలో వారు కలసివున్న అద్భుతమైన రోజుల వరకు, ప్రేమ యొక్క కొత్త అధ్యాయాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ పాటలో నాని, మృణాల్ డిలైట్ ఫుల్ కెమిస్ట్రీ మెస్మరైజ్ చేస్తోంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయ్యే మరొక ప్లజెంట్ నంబర్‌ను అందించారు. మొదటి రెండు పాటల్లాగే ఇది కూడా ఆల్బమ్‌లో మరో బ్లాక్‌బస్టర్ సాంగ్ అవుతుంది. కృష్ణకాంత్ ఆకట్టుకునే, మీనింగ్ ఫుల్ లిరిక్స్ అందించారు. కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ వోలక్స్ ఎక్స్ ప్రెషివ్ గా వున్నాయి.
Also Read:KCR:పువ్వాడా పువ్వు కావాలా?..తుమ్ముల ముల్లు కావాలా?
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఈ ఆడిటోరియం నాకు చాలా స్పెషల్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సమయంలో ఇక్కడికి వచ్చాను. వరుసగా ఎనిమిది సూపర్ హిట్లు నాన్ స్టాప్ గా కొట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఈసారి పదహారు సూపర్ హిట్లు కొట్టకుండా బ్రేక్ తీసుకుంటే కరెక్ట్ కాదని ఫిక్స్ అయిపోయా. ఇక్కడ నుంచి మా ప్రమోషనల్ కాంపెయిన్ స్టార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. హాయ్ నాన్నలో మీకు కావాల్సినంత ప్రేమ దొరుకుతుంది. థియేటర్ కి వెళ్లి మంచి ప్రేమకథ చూసి చాలా రోజులైయింది. ఇందులో మీకు టన్నులకొద్ది ప్రేమ దొరుకుతుంది. హాయ్ నాన్నలో గొప్ప మ్యాజిక్ వుంది. అది మీ అందరికీ నచ్చుతుంది. సీతారామం తర్వాత మృణాల్ ని అందరూ సీత అంటున్నారు. దీనికి మించిన పాత్ర హాయ్ నాన్నలో తను చేసిందని మా నమ్మకం. డిసెంబర్ 7తర్వాత తన పేరు యష్నా గా మారిపోతుంది. హాయ్ నాన్న 7న విడుదలౌతుంది. అందరూ థియేటర్స్ లో చూడండి. హాయ్ నాన్న తప్పకుండా మీ అందరినీ గొప్పగా అలరిస్తుంది’ అన్నారు
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. సీతారామంతో మీ అందరూ నాపై ఎంతో ప్రేమ చూపించారు. హాయ్ నాన్నలో అమ్మాడి పాట చాలా స్పెషల్. హేషమ్ అబ్దుల్ స్వరపరిన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో కూడా అద్భుతమైన పాటలు వున్నాయి. అమ్మాడి పాట మీ అందరితో పంచుకోవడం అనందంగా వుంది. హాయ్ నాన్న చాలా స్పెషల్ మూవీ. నాని గారు నేచురల్ స్టార్. ఆయనతో కలసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సీతారామంతో సీతలానే ఇందులో యష్నా పాత్ర కూడా మనసుని హత్తుకుంటుంది. అందరూ తప్పకుండా సినిమా చూడాలి. మీ అందరికీ సినిమా నచ్చుతుందన్నారు.