ఇటీవల బాలీవుడ్ వెళ్లి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన రామ్‌గోపాల్ వర్మ ‘సర్కార్-3’ వివాదాల్లో చిక్కుకున్నవిషయం తెలిసిందే. ఈ సినిమాకి కథ రాసింది వర్మ కాదు అంటూ ఓ వ్యక్తి వర్మపై కేసు వేశాడు. అతనే నీలేష్ గిర్కార్. ‘సర్కార్-3’ కథని వర్మ నొక్కేశాడని, అందుకు డబ్బు కూడా చెల్లించలేదని,అంతేకాకుండా టైటిల్స్‌లో తన పేరు కూడా వేయడం లేదని సదరు రచయిత బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దాంతో కోర్టు రచయితకే సపోర్టునిస్తోంది.
ఈ కేసు కారణంగా తన ‘సర్కార్3’ సినిమా విడుదల ఆగిపోయే పరిస్థితి ఎదురవడంతో కోర్టు చెప్పిన మాటలను వర్మ ఫాలో అవ్వక తప్పలేదు. ఈ సినిమా రైటర్స్ లో తాను కూడా ఓ రచయితనని అయితే సినిమా టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వలేదని.. పారితోషికం కూడా పెండింగ్ లో పెట్టారని చెప్పడంతో ఈ కేసును విచారించిన కోర్టు వర్మదే తప్పుఅని తేల్చింది. వర్మకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది.
నీలేష్ కు రైటర్ గా క్రెడిట్ ఇవ్వడంతో పాటు తన బ్యాలన్స్ రెమ్యూనరేషన్ ఆరు లక్షలు కూడా తిరిగివ్వాలని ఆదేశించింది. వర్మ దానికి అడ్డు మాట్లాడకుండా కోర్టు చెప్పినట్లుగా చేయడానికి అంగీకరించాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా రెండు సార్లు వాయిదా పడింది.
ఇక ఇప్పుడు కూడా వాయిదా పడుతుందేమోనని వర్మ కాస్త భయపడే అంగీకరించాడని చెప్పాలి. ఇక ఈ సినిమా శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో ఈ కేసు కారణంగా ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండాలని వర్మ ఇంక సైలెంట్ అయిపోయాడు. ఈ సినిమా వర్మ కెరీర్ కు చాలా కీలకమైంది. అందుకే ఈ సినిమాపై చాలా ఆశలనే పెట్టుకున్నాడు వర్మ.