ఉత్తరాది వారిపై ద్వేషం లేదు…

197
Pawan comments on Ashok Gajapathi Raju
- Advertisement -

తనకు ఉత్తరాది వారిపై ద్వేషం లేదని జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్‌ లో మీడియాతో మాట్లాడిన పవన్‌ అందరికీ అవకాశాలు రావాలన్నదే తన కోరికని చెప్పారు. ఉత్తరాది వారికి దక్షిణాదిలో అవకాశాలిస్తున్నట్లుగానే ఉత్తరాదిలో దక్షిణాది వారికి అవకాశాలు కల్పించాలన్నారు.

ఇక పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలపై స్పందించిన పవన్…. నేను ఎవరో అశోక్ గజపతిరాజుకు తెలియకపోవచ్చని… కానీ, ఆయన మాత్రం తనకు బాగా తెలుసని పవన్ నవ్వేస్తూ చెప్పారు.  తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తన కర్తవ్యమని చెప్పారు. వామపక్ష పార్టీలు (లెఫ్ట్) అంటే తనకు గౌరవముందని, ఆ పార్టీలతో భవిష్యత్ లో కలిసి పనిచేసే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ చెప్పారు.

- Advertisement -