జాన్వీ కపూర్ ఈ మధ్య నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల ఆమె మిలి మిలి నౌడియల్, బావాల్, మిస్టర్ & మిస్సెస్ లో తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఐతే, ఈ సినిమాలేవీ జాన్వీ కపూర్ కు అంతగా కలిసి రాలేదు. హిట్లు లేకున్నా ఆమె ముంబైలో కొత్త అపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నట్లు చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఇప్పుడు తాజా సంచలనం ఏమిటంటే, జాన్వీ కపూర్ తన కోసం బాంద్రాలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిందని అంటున్నారు. అయితే, ఈ విషయాన్ని జాన్వీ కపూర్ ఇంకా ధృవీకరించలేదు.
నిజానికి, జాన్వీ కపూర్ రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా ఓ విల్లాని కొనుగోలు చేసింది. ఇప్పుడు ముంబైలో కూడా ఈ జాన్వీ పాప ఓ కొత్త అపార్ట్మెంట్ ను కొనుక్కుంది. ఈ అపార్ట్మెంట్ 4- BHK అని తెలుస్తోంది. దీని విలువ ₹37 కోట్లు ఉంటుందని అంటున్నారు. అన్నట్టు క్రికెటర్ కేఎల్ రాహుల్, అలాగే మరో హీరోయిన్ కృతి సనన్ కూడా ఇదే భవనంలో నివసిస్తున్నారు. మొత్తానికి జాన్వీ కపూర్ రెండు చేతుల నిండా సంపాదిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ దేవర సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకున్న దగ్గర నుంచి జాన్వీ కపూర్ రేంజ్ పెరిగిపోయింది.
పైగా దేవర సినిమాలో జాన్వీ కపూర్ పవర్ఫుల్ యాక్షన్ రోల్లో కనిపించబోతుంది. దేవర చిత్రం సముద్రం నేపథ్యంలో రాబోతుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ అంతర్జాతీయ మూవీని కొరటాల శివ కసితో తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమా జాన్వీ కపూర్ కి ఎంతవరకు కలిసి వస్తోందో చూడాలి.
Also Read:దీపావళికి గేమ్ ఛేంజర్