బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ. 55,700గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 60,760గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 55,850గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 60,910గా ఉంది.
బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 500 తగ్గి రూ. 77,500గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో రూ. 74,100గా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు 50 డాలర్లకుపైగా పెరిగి స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1975 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.05 డాలర్ల వద్ద ఉంది.
Also Read:ఎలక్షన్ రిపోర్ట్: ఈ మూడు చోట్ల ‘బాద్ షా’ లే?